
* లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించిన యూకే
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించింది. సినిమా రంగం((Film industry) =లో చిరంజీవి అందిస్తున్న సేవలకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ లో ఈ అవార్డు అందజేయనున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం (UK Government) గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్ (Parliament) లోని హౌస్ ఆఫ్ కామన్స్ (House of Commons) లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న‘జీవిత సాఫల్య పురస్కారం’ (Lifetime Achievement Award) ప్రదానం చేయనుంది.
……………………………..