
* 600/600 మార్కులు సాధించిన కాకినాడ విద్యార్థిని
* మొత్తం 81.14% ఉత్తీర్ణత
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన రికార్డు సాధించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు శాతం మార్కులు సాధించింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను (AP 10th Results) ఈరోజు ఉదయం , విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ సంవత్సరం, 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది 81.14% ఉత్తీర్ణులయ్యారు. బాలురు 78.31శాతం, బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని మొత్తం 1,680 పాఠశాలు 100శాతం ఉత్తీర్ణత సాధిచంగా.. 19 పాఠశాలల్లో విద్యార్థులెవరూ ఉత్తీర్ణత సాధించలేదు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరుత్సాహపడొద్దని సూచించారు. మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాగా ఈసారి ఫలితాల్లో కాకినాడ భాష్యం స్కూల్ కు చెందిన నేహాంజలి 600/600 మార్కులు సాధించింది. టెన్త్ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు.. మనమిత్ర వాట్సాప్ యాప్ లో విద్యార్థులు తెలుసుకోవచ్చు. అదేవిధంగా https://10tv.in/ap-ssc-results-2025 లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
……………………………………………………………….