* డిసెంబర్ 4నుంచి ప్రారంభం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితి జనంబాట పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో యాత్ర చేపట్టిన విషయం తెల్సిందే.. ఈ యాత్ర అక్టోబరు 25వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఇప్పటికే కవిత మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. కాగా ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన జనంబాటను కవిత తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ లేని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో డిసెంబరు నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు యాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో డిసెంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కవిత యాత్ర చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18,19 తేదీల్లో, గద్వాల జిల్లాలో 21, 22 తేదీల్లో యాత్ర నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సూర్యాపేట, సిరిసిల్ల, జనగామ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జగిత్యాల, మహబూబాబాద్, నిర్మల్, నారాయణపేట, సిద్ధిపేట, మంచిర్యాల జిల్లాలో ఫిబ్రవరి మూడో వారం వరకు యాత్ర కొనసాగించనున్నారు.
………………………………………
