* ఏటీసీ విద్యార్థులకు ప్రతి నెలా రూ.2000
* ఆర్టీసీలో అప్రంటెస్ షిప్
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థి, యువతకు విదేశాల్లో సైతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కల్పించేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) తెలిపారు. హైదరాబాద్ మల్లేపల్లి ఏటీసీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లడారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సత్య నాదెళ్ల(SATYA NADELLA), సాంకేతిక నైపుణ్యం ఉండడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. స్కిల్స్ , స్పోర్ట్స్ యూనివర్సిటీల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామన్నారు. నైపుణ్యం ఉంటే దేశాలన్నీ తమ ముందు మోకరిల్లుతాయని అన్నారు. వ్యసనాల బారిన పడితే తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరూ అంచనా వేయలేరని అన్నారు. బిడ్డలు వ్యసనాల బారిన పడితే ఆ నష్టం ఎవరూ అంచనా వేయలేరన్నారు. త్వరలో మరో 53 అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ) పెడుతున్నామని వెల్లడించారు. ఉద్యోగం కావాలంటే నైపుణ్యం ఉండాల్సిందే అన్నారు. ఐటీఐల్లో, ఏటీసీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు ఆర్టీసీలో అప్రంటెస్ షిప్ ఇవ్వాలని మంత్రి పొన్నాన్ని కోరుతున్నా అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఏటీసీ(ATC)ల్లో శిక్షణ పొందే ప్రతీ విద్యార్థికీ నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు. విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఓ వింగ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి కేసులు పెరిగిపోతున్నాయని, ఉద్యోగాలు లేక యువత పక్కదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలవాటు నుంచి అమ్మకందారులుగా మారుతున్నారని వెల్లడించారు. గత పదేళ్లలో యువతను పట్టించుకోకుండా మానేశారని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మీ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని విద్యార్థులకు ఏం అవసరం ఉన్నా తాము చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

……………………………………….
