
* కాకతీయ కళాసంస్కృతికి నిలయం త్రికూటాలయం
* అంగరంగ వైభవంగా వేడుకల నిర్వహణ
ఆకేరున్యూస్, వరంగల్: హన్మకొండ వేయిస్తంభాల గుడిలో శివరాత్రి వేళ పాంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. రుద్రేశ్వరి, రుద్రేశ్వరులకు మంగళస్నానాలు చేయించి వధూవరులుగా చక్కగా అలంకరిస్తారు. బుధవారం ఉదయం మూడిరటికే స్వామికి సుప్రభాత సేవ, మంగళవాయిద్య సేవ, మహాగణపతికి నవరసాభిషేకం నిర్వహించిన తర్వాత రుద్రేశ్వరుడికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకం చేస్తారు. సాయంత్రం ఆరింటికి శివపార్వతుల కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో విశేషంగా మహా రుద్రాభిషేకం ఉంటుంది. శివరాత్రి మర్నాడు స్వామికి నాకబలి, సదస్యం కార్యక్రమాలు ఉంటాయి. పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. కాకతీయుల కళావైభవానికి, భక్తి పారవర్శానికి నిలయం వేయి స్తంభాల దేవాలయం. వేయి స్థంబాల పేరుతో నిర్మితమైన ఆలయ వైభవం నేటికి కొనసాగుతుంది. ఈ దేవాలయంలో శివలింగాన్ని రుద్రేశ్వరస్వామిగా కొలుస్తారు. అంతేకాదు వేయిస్థంభాల దేవాలయానికి మరో విశిష్టత ఉంది. భక్తి భావంతో పాటు ఆలయంలో శిల్పకల ఉట్టిపడుతుంది. వేయిస్తంభాల దేవాలయాన్ని త్రికుటాల యంగా పిలుస్తారు. ఇక్కడ శివునితోపాటు విష్టుమూర్తి, సూర్య భగవానుడు కొలుపుదీరాడు. 850 ఏళ్ల ఘనచరిత కలిగి దేశంలోనే ప్రముఖ పర్యటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందీ ఆలయం. రుద్రేశ్వరాల యంగానూ దీనికి పేరుంది. క్రీ.శ. 1163లో కాకతీయుల రాజు రుద్రదేవుడి హయాంలో వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించారు. వేయి స్తంభాలతో ఆలయంతో పాటు ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపాన్ని అత్యంత సుందరనీగా తీర్చిదిద్దారు. కాకతీయు నిర్మాణం పూర్తి కావడానికి 80 సంవత్సరాలు పట్టినట్లు చరిత్ర చెబుతుంది. శైవ క్షేత్రాల్లో సాదారణంగా శివునికి, శివలింగానికి ఎదురగా నందీశ్వరుడు ఉంటారు. కానీ వేయిస్తంభాల దేవాలయంలో బిన్నంగా సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఈ ఆలయం మరో విశిష్టతను కల్గిఉంది. త్రికూటాలయంగా నామకరణం చేసి శివునికి ఎడమై వైపున విష్టుమూర్తిని, ఎదురుగా సూర్యభగవానున్ని ప్రతిష్టించారు. విష్టుమూర్తికి నిత్య కళ్యాణం మచ్చతోరణం అన్నట్లు నిత్యపూజలు జరుగుతాయి కాబట్టి విష్టుమూర్తికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం విగ్రహం వెనకాల కళ్యాణమండపం నిర్మించారు. రుద్రదేవ మహారాజు. ఇక్కడ శివునితోపాటు విష్టుమూర్తి, సూర్యభగవానుడు నిత్య పూజులు అందుకోనేవారు. ఉత్సవాల వేళ చుట్టూ మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాల అలంకరణ, పుష్పాలంకరణతో ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
………………………………………..