
* రష్యాలో భారీ భూకంపం
* రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రత నమోదు
* రష్యా, జపాన్,హవాయి ద్వీవులకు సునామీ ముప్పు
* సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
* తీర ప్రాంతాల రహదారులు మూసివేత
ఆకేరు న్యూస్ డెస్క్ : రష్యా దేశం ఒక్కసారిగా ఒణికిపోయింది. రష్యాలో భారీ భూకంపం ( earth quake) సంభవించింది. రష్యాలోని కమ్ చట్ స్కీ ( kamchatskee) ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది.అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సునామీ (tsunami)హెచ్చరికలను జారీ చేశారు. రష్యా, జపాన్ దేశాలకు సునామీ ముప్పు పొంచివుంది. అమెరికా, ఇతర పసిఫిక్ దేశాలకూ సునామీ హెచ్చరికలు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లో రహదారులను మూసివేశారు. ఈ భూకంపం వల్ల జపాన్ మరియు హవాయి దీవుకు సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చిరికలు జారీ చేశారు.
సునామీ పై అలర్ట్ (alert)
యునైటెడ్ స్టేట్స్ ( united states)సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం.. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం- భూకంపం 19.3 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. ఇది అవచా బేలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీకి తూర్పు ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కమ్ చట్ స్కీ ప్రాంతంలో 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు నమోదయ్యాయని రష్యా ప్రకటించింది. వచ్చే మూడు గంటల్లో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ హెచ్చరించింది. వాయువ్య హవాయి దీవులు, రష్యా తీర ప్రాంతాల్లో అలల ఎత్తు మూడు మీటర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చనని అంచనా వేసింది. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు రావొచ్చని పేర్కొంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, తైవాన్ తీరాలలో 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ప్రారంభంలో 8.7 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత 8.8గా సవరించబడింది. ఈ తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3-4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డయ్యాయి. రష్యా అధికారుల ప్రకారం, ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది.
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
సునామీ హెచ్చరికలు ఈ భూకంపం తర్వాత, జపాన్లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చాయి అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హవాయి రాజధాని హోనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలకు తక్షణ స్థలం ఖాళీ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్వామ్ దీవిలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే ఛాన్స్ ఉందని అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.
ధైర్యంగా ఉండండి : ట్రంప్( donald trump)
పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయింది.
అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సురక్షిత ప్రాంతాలకు తరలి అధికారుల సూచనలు పాటించాలని ప్రజలను ట్రంప్ కోరారు.
………………………………………………..