* బడ్జెట్‌పై చర్చలో మాటకు మాట
* ప్రధాని మోదీకి కోపం వస్తుందనే కేసీఆర్ సభకు రాలేదు
* తండ్రి, తాతల పేర్లతో మేం రాజకీయాల్లోకి రాలేదు
* కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చారన్న రేవంత్ రెడ్డి
* సీఎం రేవంత్‌కు సమాధానం చెప్పేందుకు మేం చాలు
* తండ్రి, తాతల గురించి రేవంత్ అంటున్నారు..
* రాజీవ్‌గాంధీ, రాహుల్ గాంధీల గురించి మాట్లాడుతున్నారా : కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) బడ్జెట్ సమావేశాలు (Budget meeting) రెండో రోజు హోరాహోరీగా కొనసాగాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. కీలకమైన చర్చ జరిగినప్పుడు కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) కి కోపం వస్తుందనే కేసీఆర్ సభకు రాలేదని విమర్శించారు. ఢిల్లీ(Delhi) కి వెళ్లి చీకటి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. బీఆర్ ఎస్ చర్చను పక్కదారి పట్టిస్తోందని, సభ నుంచి బయటకు పోవాలని బీఆర్ ఎస్(BRS) యోచిస్తోందని అన్నారు. తాను పరిషత్ స్థాయి నుంచి సీఎం స్థాయికి స్వయంకృషితో ఎదిగానని, తండ్రి, తాత పేరు చెప్పుకుని రాలేదని అన్నారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చారన్నారు. చదువురాకపోయినా తీసుకొచ్చి ఎవరినీ మంత్రులను చేయలేదన్నారు.
రాజీవ్ గురించా, రాహుల్ గురించా,.
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కూడా గట్టిగానే బదులిచ్చారు. రేవంత్‌కు సమాధానం చెప్పేందుకు తాము చాలని, కేసీఆర్(KCR) లాంటి వ్యక్తి అవసరం లేదని తెలిపారు. నియమాల ప్రకారం సభను నడపాలని సూచించారు. ప్రభుత్వం దేని గురించి మాట్లాడాలని అనుకుంటుందో ముందుగా తమకు చెప్పాలన్నారు. తండ్రి, తాతల గురించి రేవంత్ మాట్లాడుతున్నారని, ఆయన రాజీవ్‌గాంధీ గురించా, రాహుల్ గాంధీ గురించా మాట్లాడుతునేది అని కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో లెక్కలు తప్పాయి కాబట్టే, పార్లమెంట్ లో బీఆర్ ఎస్ లేదు కాబట్టే బడ్జెట్లో తెలంగాణ పదం లేదన్నారు. అప్పుడు 8+8=16 అయితే, ఇప్పుడు 8+8=గుండు సున్నా అయిందన్నారు. కాగా, కేంద్రంపై ప్రభుత్వం పెట్టిన తీర్మానానికి తమ మద్దతు తెలిపారు.
———————