
* ఇది చారిత్రక పర్యటన : విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఆకేరు న్యూస్ డెస్క్ : విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం నైజీరియా(NIZERIA)కు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(NARENDRA MODI)కి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు, భారతీయ కమ్యూనిటీ సభ్యులు అక్కడకు అధిక సంఖ్యలో చేరుకుని ఆహ్వానం పలికారు. 17 ఏళ్లలో పశ్చిమ ఆఫ్రికా దేశానికి భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత నైజీరియా చేరుకున్నారు. అబుజా విమానాశ్రయానికి(ABUJA AIRPORT) చేరుకున్న ప్రధాని మోదీకి నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు, ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ నైజీరియా మంత్రి నైసోమ్ ఎజెన్వో వైక్, విశ్వాసం,సద్భావనకు చిహ్నంగా అబుజా సింబాలిక్ “కీ టు ది సిటీ”ని భారత ప్రధానికి అందించారు. ఇది “నైజీరియా ప్రజలు ప్రధానమంత్రికి ఇచ్చిన విశ్వాసం, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది చారిత్రాత్మక పర్యటన(HISTORICAL TOUR)గా వర్ణించింది.
………………………………….