
* ఇక పదిరోజులు అక్కడే..
ఆకేరున్యూస్, ఢిల్లీ: ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘విపశ్యన ధ్యానం కోర్సు’కు వెళ్లనున్నట్లు సమాచారం. పది రోజుల పాటూ ధ్యానంలో పాల్గొననున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఇందుకోసం ఆయన పంజాబ్లోని హోషియార్పుర్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 5 నుంచి 15 వరకు ఆయన ధ్యాన కేంద్రంలోనే ఉండనున్నట్లు సమాచారం.
………………………………………..