* కుతుల్బాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై దాడి
* కార్యాలయం గేట్‌కు తాళం వేసి విచారణ
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : ఏసీబీ దూకుడు పెంచింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేసింది. కుతుల్బాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సోదాలు చేపట్టారు అధికారులు. కార్యాలయ గేట్‌కు తాళం వేసి అధికారులను విచారణ చేస్తున్నారు. డాక్యూమెంట్ రైటర్ వద్ద వివరాలు సేకరించారు. డాక్యూమెంట్ రైటర్ అవకతవకలకు పాల్పడుతున్నాడనే పక్కా సమాచారంతో సోదాలు చేస్తున్నారు. కుతుల్బాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ఏసీబీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని బయటివారు లోపలికి రానివ్వకుండా తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ దాడులతో రిజిస్ట్రార్ కార్యాలయంలో కలవరం మొదలైంది. అటు ఆంధ్రలోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. అటు ఆంధ్ర..ఇటు తెలంగాణాలో ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరించడంతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది.
…………………………………………………………..
