
* రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్
ఆకేరు న్యూస్, జగిత్యాల : జిల్లాలోని కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు (ACP OFFICERS RIDES) నిర్వహించారు. 7వేల రూపాయలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ రఘు పట్టుబడ్డారు. సీపీఎస్ (CPS)డబ్బుల నుంచి లంచం ఇవ్వాలని రఘు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే బాధితుడి ఖాతాలో డబ్బులు పడడంతో తనకు ఇస్తానన్న ఏడు వేల రూపాయలు ఇవ్వాలంటూ అనేక సార్లు ఫోన్ చేయడంతో బాధితుడు విసిగిపోయి ఏసీబీ (ACB) అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని రఘు కుమార్ ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………..