ఆకేరు న్యూస్, నిజామాబాద్ : ఏసీబీ దాడులు ఆగడం లేదు. తాజాగా బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని వివిధ విభాగాలలో తమ పనుల నిమిత్తం జనాలతో హడావిడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు వచ్చి నేరుగా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడే ఉన్న ప్రజలు ఏం జరిగిందోనని అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. టౌన్ ఫ్లనింగ్ అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారంతో ఈ సోదాలు చేపడుతున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆఫీసులో పని చేస్తున్న పలువురు సిబ్బంది పై ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ బృందం ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
…………………………………………..
