* సోదాల్లో విస్తుపోయే విషయాలు బట్టబయలు
* భారీగా నగదు, బంగారం స్వాధీనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏసీబీ ఏకకాలంలో దాడులు చేపట్టింది. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు చేశారు. లెక్కచూపని రూ. 2.51 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. 289 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారుల వద్దే ఉంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయాల్లో సిబ్బంది చేసే తప్పులు తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగానే సీసీ కెమెరాలను పని చేయకుండా చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఆయా కార్యాలయాల్లో 19 మంది ప్రయివేటు వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు తిరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. 13 మంది సబ్ రిజిస్ట్రార్ అధికారుల ఇళ్లలో సైతం సోదాలు చేపట్టారు. పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏసీబీ అధికారులు ఆంధ్రాలోనూ పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడులతో తెలుగు రాష్ట్రాల్లో కలవరం మొదలైంది.
…………………………………………………
