* నలుగురి దుర్మరణం
* మృతులందరూ హైదరాబాద్ వాసులే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నంధ్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం, నల్లగుట్ట వద్ద కారు, ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డివైడర్ ను దాటి మరీ ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును కారు ఢీకొట్టింది. తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరగడం విచారకరం. మృతులు అందరూ హైదరాబాద్ నిజాంపేట వాసులుగా గుర్తించారు. గుండేరావు, శ్రావణ్, బన్నీ, నర్సింహగా గుర్తించారు. నిజాంపేటలో గుండేరావు క్యాటరింగ్ నిర్వహిస్తుంటారు. వీరి మృతితో నిజాంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయి, సిద్దార్థ అనే మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………………..

