* ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ను డీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.చండ్రుకొండ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు కిష్టాపురం వద్ద డివైడర్ ను ఢీకొంది. కారు పల్టీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు పల్టీ కొట్టడంతో కారు వేగంగా వచ్చినట్లు భావిస్తున్నారు.గాయ పడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
………………………………..
