
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు సమాచారశృాఖ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 30వ తేదీతో ముగియనున్న అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అక్రిడేషన్ కార్డుల గడువును పొడిగించడం ఇది నాలుగోసారి. ఇప్పటికే అక్రిడేషన్ల పరిమితి, విధివిధానాలపై ప్రెస్ అకాడవిూ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి ఓ నివేదిక సమర్పించారు.
………………………………