
* ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో నమోదైన పోక్సో కేసులో నిందితునిపై నేరము నిరూపణ అయినందున ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ నిందితునికి జీవిత ఖైదు తో 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో రూ. 3,000/– జరిమానా విధించారని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఎండి గౌస్ పాషా కిరాణా షాపు యజమాని అని తెలిపారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి అశోక్ కుమార్ , స్థానిక పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, కోర్టు కానిస్టేబుల్ లను ఎస్పీ అభినందించారు.
………………………………