
* మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్లే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటి వరకు చర్చలు, ఢిల్లీ పర్యటనల వరకే ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పైన ప్రచారం జరుగుతున్న వేళ ఎట్టకేలకు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయడానికి ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీ ఉండగా ఎవరెవరికి ఇవ్వాలి అన్న విషయం పైన అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సంభాషణ అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యతను కల్పిస్తూ మంత్రివర్గంలో స్థానం కేటాయించాలని భావించినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి, ఒక ముస్లిం సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రులుగా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది.
దాదాపు 16 నెలల అనంతరం..
దాదాపు 16 నెలలుగా మంత్రి వర్గంలో ఖాళీలు ఉన్నాయి. తాజాగా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో ఢిల్లీలో సోమవారం కీలక సమావేశంలో మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. అయితే ప్రస్తుతం వీటిలో నాలుగు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. కొత్త మంత్రులు ఏప్రిల్ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌కు చోటు లభించే ఛాన్స్ ఉన్నది. ఎస్సీల్లో చెన్నూ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మైనారిటీల్లో అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌ను మంత్రి పదవి వరించే అవకాశం ఉంది.
ఆసక్తికర చర్చ
దాదాపు 16 నెలలుగా మంత్రి వర్గంలో ఖాళీలు ఉన్నాయి. తాజాగా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో ఢిల్లీలో సోమవారం కీలక సమావేశంలో మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. కాగా, మొత్తానికి సాధించారు అంటూ వివేక్ తో అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన గడ్డం వివేక్ వెంకటస్వామి తో సరదా సంభాషణ చేశారు. వివేక్ వెంకటస్వామి తో మాట్లాడిన మల్లారెడ్డి మొత్తానికి సాధించారు.. సీఎం, డిప్యూటీ సీఎం కంటే ముందే ఢిల్లీ వచ్చారు అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది.
…………………………………….