* హీరో అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చిన పబ్బతి విష్ణుమూర్తి
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో కొనసాగిన విష్ణుమూర్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1991లో ప్రొబేషనరీ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో పని చేశారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ గా పనిచేశారు. విష్ణుమూర్తి స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం
అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చిన విష్ణుమూర్తి
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పుష్ఫ 2 సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై సోమాజీ గూడలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్మీట్ పెట్టి హీరో అల్లు అర్జున్ కే వార్నింగ్ ఇచ్చారు. ఎంత పెద్ద
సెలబ్రిటీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు.పోలీసులనే బద్నాం చేస్తూ అల్లు అర్జున్ మాట్లాడుతున్నారని అల్లు అర్జున్ తన పరిధి దాటి మాట్లాడకూడదు అని హెచ్చరించారు. బందోబస్తులో ఉన్న పోలీసులు 10 నిమిషాలు వదిలేసి పోతే సెలబ్రిటీల బతుకులు ఆగమైపోతాయని విష్ణుమూర్తి ప్రెస్మీట్ లో హెచ్చరించారు. అంకిత భావం,నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే విష్ణుమూర్తి మరణంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది.
………………………………………….
