ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ పరిధిలో తాడ్వాయి, మేడారం, వాజేడు, ములుగు, టూరిజం హోటల్ లను ఫెరియాడో రిసార్ట్స్ యాజమాన్యం లీజుకు తీసుకుని ఈనెల 4న రాత్రికి రాత్రే వర్కర్ల యొక్క మూడు నెలల వేతనాలు చెల్లించకుండా బిచాన ఎత్తేసి సామాన్లు సర్దుకొని వెళ్లిపోయిన ఫెరియాడో ఎండి సిద్ధార్థ పై తగు చర్యలు తీసుకొని కార్మికుల మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఈరోజు తాడ్వాయి ఫేరియాడో రిసార్ట్స్ లో వర్కర్లను కలిసి వారితో మాట్లాడిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని ఈ రకంగా వర్కర్ల జీతాలు చెల్లించకుండా అర్థరాంతరంగా వెళ్లిపోయిన పెరియాడో సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫిర్యాదు పరిధిలో ఉన్నటువంటి టూరిజం హోటల్ లను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని, ప్రస్తుతం పని చేస్తున్న వర్కర్లనే కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫెరియాడో సంస్థ యాజమాన్యం వర్కర్లకు పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా తీరని అన్యాయం చేసిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఫిర్యాదు సంస్థ యాజమాన్యాన్ని పిలిచి చర్చించి వర్కర్ల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన పోరాటాలు చేయబడుదామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు అరవింద్, అనిల్, ప్రేమ్, రమేష్, భాను ప్రకాష్, విజయేందర్ రెడ్డి, కొలుకుల సమ్మయ్య, ఆత్కూరి సమ్మయ్య, రాజు ,ముకుందం, గొంది సమ్మయ్య ,పవన్, మౌనిక, స్వాతి ,ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
………………………………..
