
ఆకేరు న్యూస్, కమలాపూర్: హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ నేతలు బుధవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చేలా, వారి కుటుంబాన్నీ కించపరిచే వీడియోలను వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తూ, రాతలు రాసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన ఎర్రవెల్లి సంపతరావు BJP జిల్లా ఉపాధ్యకుడు, శీలంశ్రీనివాస్ మున్సిపాలిటి చైర్మన్, బింగి కరుణాకర్ , మాసాడి ముత్యంరావు, పెద్దిమల్లారెడ్డి, పల్లె వెంకట్‌రెడ్డి, నల్ల సుమన్, సింగిరెడ్డి ,తిరుపతిరెడ్డి, కంకణాల రమారెడ్డి, అబ్బిడి సురేందర్‌రెడ్డి, గాలేటి సురేందర్‌రెడ్డి, మౌటం అశోక్, ఎనగంటి శ్రీనివాస్, గాదె మహేష్, కొమ్ము అశోక్, కొత్త శ్రీనివాస్, కోరే రవీందర్, జోడు సంపత్, మురికి మహేశ్, బొజ్జ శరత్, దాగు అశోక్ రెడ్డి, టీవీఎస్ శీను పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
…………………………………………………………