* ఐటీ పెనాల్టీ పిటిషన్ కొట్టివేత..
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ నటుడు, టీవీకే (TVK) అధినేత విజయ్‌కు ఆదాయపన్ను శాఖ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ శాఖ విధించిన రూ. 1.50 కోట్ల జరిమానాను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాల కారణంగా ఐటీ శాఖ విజయ్‌కు రూ. 1.50 కోట్ల పెనాల్టీ విధించింది.ఈ నోటీసులను సవాల్ చేస్తూ విజయ్ 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు.సుదీర్ఘ వాదనల అనంతరం గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు, తాజాగా విజయ్ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన ఆ జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
…………………………………………..
