* అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అక్రమ ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపధ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ అరెస్గ్ అయి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. గత నెల ఏసీబీ అధికారులు అంబేద్కర్ నివాసంతోపాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అంబేద్కర్‌కు సంబంధించిన ప్లాట్లు, భవనాలు, భూములను అధికారులు గుర్తించారు. అంబేద్కర్ ఆస్తులకు బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపధ్యంలో జైలులో ఉన్న అంబేద్కర్ ను ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు అంబేద్కర్ ను నాలుగు రోజులు కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది, సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
…………………………………………………
