ఆకేరున్యూస్, హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. మినిస్టర్లు పొన్నం, వివేక్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. అంతటితో ఆగని మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేను కలుస్తానని స్పష్టం చేశారు. రేపటిలోగా పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
…………………………………..
