
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (Steve Smith) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. మంగళవారం భారత్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ లో నాలుగు వికెట్లతో ఆసీస్ పరాజయం పాలైంది. దీంతో వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లుగా తాజాగా స్మిత్ తెలిపాడు. 2010లో అంతర్జాతీ క్రికెట్ (International Cricket) లో స్మిత్ అడుగుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే మేటి బ్యాటర్ గా ఎదిగాడు. తన వన్డే కెరీర్ లో 170 మ్యాచ్ లాడిన స్మిత్.. 5,800 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 35 ఫిఫ్టీలు ఉన్నాయి. 43.28 సగటుతో తను పరుగులు సాధించాడు. తన అత్యధిక స్కోరు 164 కావడం విశేషం. 2015, 2023 వన్డే ప్రపంచ కప్ సాధించిన ఆసీస్ టీమ్ (Asis Team)లో తను సభ్యుడు కాగా, ఆసీస్ సాధించిన ఎన్నో టోర్నీలలో తనదైన ఆటతీరుతో స్మిత్ ప్రశంసలు పొందాడు. అలాగే టెస్టుల్లో మేటి బ్యాటర్లలో ఒకడిగా స్మిత్ కు గుర్తింపు ఉంది.
……………………………