
* ఎయిర్ పోర్టు తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్
* తాజాగా ప్రారంభించిన మోదీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని బేగంపేట రైల్వేస్టేషన్ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26.55 కోట్ల అంచనా వ్యయంతో బేగంపేట రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రవేశ ద్వారం, 12 మీటర్ల అడుగుల ఫూట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్, ఎస్కలేటర్, స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్ వంటి సౌకర్యాలు కల్పించింది. ఎయిర్ పోర్ట్ తరహాలో ఆకట్టుకునేలా రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం ఆకట్టుకునేలా ఉంది. రాతి సంపద, వాటిపై పక్షులు వాలినట్లుగా ఆకర్షణీయంగా మలిచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన బేగంపేట రైల్వే స్టేషన్ ఎలా ఉందో మీరూ చూసేయండి.. దృశ్యమాలిక.. ఇదిగో.
……………………………………..