
* హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Hyderabad Local Body MLC Elections Result) ఫలితాలు వెలువడ్డాయి. ఊహించినట్లుగానే గెలుపు ఎంఐఎం (MIM) సొంతమైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గంటలోనే ఫలితం వెలువడింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్‌కు 63 ఓట్లు పోలవగా, బీజేపీ (BJP) తరఫున బరిలో నిలిచిన డాక్టర్ గౌతమ్‌రావుకు 25 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎంఐఎం అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తం 112కు గానూ 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగ్గా, ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్ (BRS) మినహా మిగతా పార్టీల సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
………………………………………