
* భారీగా ప్రాణ నష్టం
* 230 మంది ప్రయాణికులు..12 మంది సిబ్బంది
* విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని ..?
* క్షతగాత్రులు ఆస్పత్రికి తరలింపు
* మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
ఆకేరు న్యూస్ ,డెస్క్ ః గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ లోని మేఘాని ఎయిర్ పోర్టునుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు ఏఐ 171 బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది వ్యవధి లోనే కుప్పకూలింది. విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి పరిసరాల్లోని జనావాసాలపై కూలింది.. విమానం కూలడంతో అందులోనుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని విమానంలో మంటలను ఆర్పుతోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని హుటా హుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విమానంలో 232 మంది ప్రయాణికులు ఉండగా 10 విమాన సిబ్బంది ఉన్నారు. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. విమానం జనావాసాలపై కూలడంతో కింద ఉన్న వారు కూడా చనిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం తో మాట్లడారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రధాని నరేంద్ర మోదీ అ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు.కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ఘటనా ప్రమాదానికి గల వివరాలను అధికారులతను అడిగి తెలుసుకొని ఘటనా స్థలికి పయనమైనట్లు తెలిసింది.
…………………………………………