* ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
* ఏటీసీలో సిగ్నళ్ల సమస్య
* నిన్న ఢిల్లీలో.. నేడు హైదరాబాద్‌లో
* దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్
* మాల్దీవుల పర్యటన రద్దు
ఆకేరు న్యూస్, డెస్క్ : సాంకేతిక కారణాలతో చాలా విమానాలు రద్దు అయిపోయాయి. కొన్ని ఎటూపోకుండా వేచి ఉన్నాయి. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ, ముంబై(Mumbai), తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు(Hyderabad Shamshabad Airport)లో కూడా అవే ఇబ్బందులు తలెత్తాయి. ఢిల్లీ (Delhi) ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక లోపంతో దాదాపు 500 దేశీయ, అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఏటీసీ(ATC)లో సిగ్నళ్ల సమస్య కారణంగా విమానాలు ఆగిపోతున్నాయి. సమస్యలను పరిష్కరించి, విమాన రాకపోకలు యధావిధిగా కొనసాగడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు (Central Minister Rammohan Naidu) దృష్టి సారించారు. నిన్న అర్ధరాత్రి వరకూ అధికారులతో సమీక్షిస్తూనే ఉన్నారు. మాల్దీవులు వెళ్లాల్సిన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-కౌలాలంపూర్, హైదరాబాద్-వియత్నాం విమానాలు సాంకేతిక లోపంతో రద్దు చేశారు. హైదరాబాద్-గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఎయిర్స్‌లైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్‌బస్ 984 ఫ్లయిట్ ఆలస్యమైంది. శుక్రవారం రాత్రి 11గంటల నుంచి వియత్నాం వెళ్లాల్సిన ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఎయిర్‌లైన్స్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
