AISF Scholarship Protest Arrest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్, ఎండి.యునుస్, పస్తం పృథ్విరాజ్ లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా యునుస్ మాట్లాడుతూ అరెస్ట్ లతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరని నిరసనలు తెలిపేందుకు స్వేచ్ఛయుత వాతావరణం ఉంటుందని ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇలా విద్యార్ధి నాయకులను అరెస్ట్ లు చేయించడం సిగ్గుచేటు అన్నారు. ఎన్ని అరెస్ట్ లు చేసినా ఎంత నిర్భంధించినా స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేసే వరకు పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలనీ లేని పక్షం లో ఆందోళనలను ఉదృతం చేస్తామని హేచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
