* దానా తుఫాను ప్రభావంతో రైల్వేశాఖ ముందస్తు చర్యలు
* మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు
* ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో తీవ్రంగా తుఫాను ప్రభావం
*విశాఖ వాతావరణం కేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ కేవీఎన్ శ్రీనివాస్
ఆకేరు న్యూస్ డెస్క్ : దానా(dana) తుఫాను ఏపీ(ap), ఒరిస్సా(orissa), పశ్చిమ బెంగాల్(west bengal) ప్రభావం చూపనుందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. మూడు రోజుల పాటు 70కు పైగా రైళ్లను రద్దు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ రైల్వేస్టేషన్(Visakha railwaystation)లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. తుఫాను వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ బోర్డర్లో రేపు రాత్రి తుఫాను తీరం దాటే అవకాశ ఉంది. తుఫాను ప్రభావం ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటుందని విశాఖ వాతావరణం కేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ కేవీఎన్ శ్రీనివాస్ వెల్లడించారు. ఏపీలోని ఉత్తర కోస్తాలో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు తమిళనాడును కూడా వరదలు వీడడం లేదు. మధురై వరదల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. సత్తయ్య కాలవ తెగడంతో తమిళనాడు(Tamilanadu)లోని చాలా కాలనీలు వరద ముంపులో ఉన్నాయి
………………………………………………..