
* ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలి
* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లుపై అన్ని ఆయా జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు పాటించాల్సిన నియమాలు వివరాలు ఏర్పాటు చేయాలన్నారు.
…………………………………………….