* హాజరైన కీలక నేతలు
ఆకేరు న్యూస్,డెస్క్ : రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Central Minister Rajnath singh) నేతృత్వంలో అఖిలపక్షంభేటీ అయింది. పార్లమెంట్ అనుబంధ (అనెక్స్) భవనంలో ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పక్షాల నేతల (ఫ్లోర్ లీడర్లు) సమావేశమయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని పార్లమెంట్ (Parliament) ఉభయ సభలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నేతలను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో “ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ” (సర్), దేశ రాజధానిలో “ప్రాణాంతక వాయు కాలుష్యం” లాంటి పలు అంశాలపై ఉభయ సభల్లో చర్చ జరిపేందుకు, తగినంత సమయాన్ని కేటాయుంచాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ(Congress Party)తో పాటు, విపక్షాల నేతలు కోరినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో 10 బిల్లులు పెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
………………………………………..
