– ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్, కమలాపూర్: మొంథా తుఫాన్ కారణంగా రానున్న 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లద్దని, విద్యుత్ తీగలు, చెట్లు, హోర్డింగ్‌లు, పాడైన గోడలు వంటి ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లవద్దనీ, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. సైడు కాలువలు నిండి ఇండ్లలోకి నీరు వస్తే 9989930714, 9182320178 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.
మొంథా తుఫాన్ భారీ వర్షాల నేపథ్యంలో కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ , సిబ్బందితో కలిసి కమలాపూర్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న డ్రైనేజీలను,నాళాలను పరిశీలించారు. గతంలో ముంపుకు గురైన బస్టాండ్ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నారు.
103 mm గా వర్షపాతం నమోదు
కమలాపూర్ లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. కుండపోత వర్షంతో ఐకెపి , పొలాల వద్ద ఆర పోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. మొంథా తుఫాన్ వల్ల చేతికి అందిన పంట వర్ష ప్రభావంతో పూర్తిగా దెబ్బతింటుందని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ధాన్యం తడవకుండా రైతులు టోర్పలీన్, సంచులతో వడ్ల కుప్పలపై కప్పారు. మండలంలోని కొన్నిచోట్ల వరద నీరు గృహవాసాలను తాకింది. మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన రైలు నెంబర్ 17234 రేపు రద్దయింది.ఇంకా రెండు రోజులపాటు వర్షాలు కురువనున్న వర్షాలు మండల వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.
…………………………………………
