* రేవంత్‌రెడ్డి సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది
* అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం చేసేవన్ని సర్కస్ ఫీట్లే అని.. రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ మొదటిరోజు శాసనసభకు అదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద నిరసనగా టీషర్ట్స్ వేసుకొని వస్తే అడ్డుకున్నారని.. ఈ రోజు రాజ్ భవన్ వద్ద అదానీ అవినీతి గురించి రేవంత్ మాట్లాడుతున్నాడని హెద్దేవ చేశారు. అక్కడికి వెళ్లి కూడా కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించే మాట్లాడిరడు తప్ప, అదానీ అవినీతి గురించి మాట్లాడిరది తక్కువన్నారు. మీ పోరాటం అదానీ మీద అయితే మొదటి రోజు మమ్మల్ని ఎందుకు అసెంబ్లీ రాకుండా అడ్డుకున్నావని నిలదీశారు. దావోస్ వెళ్లి అదానీతో రూ. 12,400 కోట్ల అగ్రిమెంట్లు చేసుకున్నావని.. నీకు నిజంగా అదానీ అవినీతి మీద పోరాటం చేయాలనుకుంటే ముందు వెంటనే అగ్రిమెంట్లు రద్దు చేయ్ అన్నారు. నీ మాటల్లో నిజాయితీ ఉంటే, వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు రూ. 12,400 కోట్ల అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని ఇమాండ్ చేశారు. అదానీ దేశ పరువు తీసిండు అని రేవంత్ రాజ్ భవన్ వద్ద అంటున్నాడని… మరి నువ్వు దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ పరువు తీయలేదా అన్నారు.
……………………………………………