* ఒకేసారి 21 బ్యాంకుల భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు
* శంకుస్థాపన చేసిన నిర్మలా సీతారామన్
ఆకేరు న్యూస్, అమరావతి : అమరావతిలో జాతీయ బ్యాంకుల భవన నిర్మాణాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. 21 బ్యాంకులు, మూడు ఇన్సూరెన్స్, ఇన్‌కంట్యాక్స్ కార్యాలయ భవన నిర్మాణాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (NIRMALA SEETHARAMAN) శంకుస్థాపన చేశారు. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఏపీ గ్రామీణ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఎల్ఐసీ, ఎన్ఐఏసీఎల్ వంటి సంస్థలు ఉన్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CHANDRABABU NAIDU), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సుమారు 6,514 మంది ఉద్యోగులకు అవకాశాలు లభించనున్నాయి. ఈ బ్యాంకు కార్యాలయాలు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో కొలువుదీరనున్నాయి.అలాగే రాజధానిలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ పనులు వేగవంతం చేశారు.
…………………………………………
