
నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లో సెప్టెంబర్ 6ను నిర్వహించనున్న
గణేష్ శోభాయత్రకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా
రానున్నారు. శోభాయాత్రలో పాల్గొనాల్సిందిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
అమిత్ షాను ఆహ్వానించింది. సెప్టెంబర్ 6న అమిత్ షా ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్ చేరుకొని పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. అనంతరం ఆయన చార్మినార్ వద్ద జరిగే వినాయక నిమజ్జనంలో పాల్గొంటారు.అమిత్ షా పర్యటన నేపధ్యంలో నగరంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
………………………………………….