* శనివారం మధ్యాహ్నం గణపతులకు స్వాగతం
* బీజేపీ నేతలతోనూ సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భాగ్య నగర గణేశ్ శోభాయత్రలో తొలిసారిగా కేంద్ర హోం మంత్రి పాల్గొనబోతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన జరిగే నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా అమిత్ షా (AMITH SHA)విచ్చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10కి బేగంపేట్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు బీజేపీ (bjp) నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హోటల్ లోనే ఏర్పాటు చేసిన 48 ఏళ్ల భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రస్థానం ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.10 నుంచి 5 వరకు ఎంజే మార్కెట్ వద్ద నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. గంగమ్మ ఒడికి తరలివస్తున్న గణనాథులకు స్వాగతం పలికి ప్రసంగిస్తారు. చార్మినార్, మోజాంజాహి మార్కెట్ల వద్ద ప్రసంగించనున్నారు. తిరిగి 5 గంటల తర్వాత బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
…………………………………………..
