
* ఆదివాసి నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్
ఆకేరు న్యూస్, ములుగు:మేడారం జాతర అబివృద్ధి నిధులతో జాతర లో లక్ష్మి దేవర విడిది సత్రం ఏర్పాటు చేయాలని ఆదివాసి నాయకుడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ హైదరాబాద్ లోని మాదాపూర్ కార్యాలయం లోని జాతీయ ఎస్టీ కమిషన్ కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని మేడారం జాతరలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ కు ఆడబిడ్డ, ఆదివాసి నాయకపోడ్ కులదైవం ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవరా ప్రతి మేడారం మహా జాతరకు జంపన వాగులో స్నానం ఆచరించి అనంతరం సమ్మక్క సారమ్మ గద్దలను ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు.లక్ష్మీ దేవర కు ఒక స్థానం అంటూ లేకుండాపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష్మీ దేవర్లు మేడారం మహా జాతరకు దాదాపుగా 150కి పైగా లక్ష్మీదేవర్లు ప్రతిమలతో మహా జాతరకు తరలి వస్తారు.అమ్మ వార్లకు మొక్కులు అప్పజెప్పడం జరుగుతుంది .ఈ మొక్కలు అప్పజెప్పిన అనంతరం బస చేయడానికి విడతి సత్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా జాటోత్ హుస్సేన్ నాయక్ కోరామని వివరించారు. అంతెకాకుండ ములుగు గట్టమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసేవిధంగా కార్యాచరణ చేయవలసిందిగా కోరారు . గట్టమ్మ దేవాలయానికి కావలసిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరామని తెలిపారు.
…………………………………………