– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శవ రాజకీయాలు మానుకో..
– హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్: నిన్న వంగర గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలిక మృతి పై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే దోషులను వదిలిపెట్టేది లేదని ప్రణవ్ అన్నారు. శనివారం మండలంలోని ఉప్పల్లో ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ…హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బాలిక పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించే సందర్భంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు బాలిక మృతదేహాన్ని తీసుకొని వచ్చి హుజురాబాద్ లోని అంబేద్కర్ వద్ద ధర్నా చేయడం ఏంటని, ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా అధికారులను అడిగి తెలుసుకోవాలని, కలెక్టర్ తో మాట్లాడాలని ప్రణవ్ అన్నారు.
ఓటు చోరీపై అసత్యపు ప్రచారాలు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 43 ఓట్లు ఉన్నాయంటూ కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, గతంలో బిీఆర్ఎస్ హయాంలో కూడా ఓట్లు ఉన్నాయంటూ ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చిందని అన్నారు. కౌశిక్ రెడ్డి ఇకనైనా బుద్ధి మార్చుకొని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు.
………………………………………………….
