
* ఆర్టీసీ అధికారుల నిర్ణయం
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : ఇక నుండి బస్ డ్రైవర్లుగా చేసేందుకు ఆసక్తి ఉన్న మహిళలకు
ఆర్టీసీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో కండక్లర్లుగా ఇతర విభాగాల్లో పని చేస్తున్న మహిళలు డ్రైవర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక ముందు ఎవరైనా ముందుకు వస్తే వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి డ్రైవర్లుగా తీసుకోనున్నారు. మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ‘మెవో’ స్వచ్ఛంద సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. హకీంపేట, సిరిసిల్లలో మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు ఆర్టీసీ భరిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా.. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చంది,. ఇక తాజాగా మహిళలకు ఆర్టీసీలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆర్టీసీ ముందుకు వచ్చింది. మహిళలకు వర్తించే రిజర్వేషన్ కోటాలో ఇప్పుడు డ్రైవర్లుగా చేరే అవకాశం ఉంది. ఇందకు ముందు డ్రైవర్లుగా మహిళలు ఆసక్తి చూపకపోవడంతో వారి పోస్టుల్లో పురుషులను నియమిస్తున్నారు. ఇక ముందు నుండి ఆసక్తి ఉన్న మహిళలు డ్రైవర్లుగా చేరదలచుకుంటే వారి పోస్టులను వారికే కేటాయిస్తారు.
………………………………………..