* గాంధీ ఆస్పత్రి వైద్యుల ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ కవి అందెశ్రీ హార్ట్ స్ట్రోక్ వల్లే మృతి చెందారని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సోమవారం ఉదయం ఇంట్లో పడిపోయి ఉన్న అందెశ్రీని కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే అందెశ్రీ మృతి చెందినట్లుడాక్టర్లు ప్రకటించారు. అందెశ్రీ గత ఐదేళ్లుగా హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారని, అయితే గత నెల రోజులుగా మందులు వాడడం లేదని గాంధీ ఆస్పత్రి హెచ్ఓడీ జనరల్ సునీల్ కుమార్ తెలిపారు.ఆయనకు ఆయాసం ఉందని, చెస్ట్ డిస్కంఫర్టబుల్ ఉందన్నారు. ఆరోగ్య విషయంలో అందెశ్రీ నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. గత రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారని తెలిపారు.
……………………………………………….
