* హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గేయరచయిత అందెశ్రీ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు ఘటకేసర్ లో నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇదిలా ఉండగా రేపు సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. కాగా అందెశ్రీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ మంత్రులు,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు తో పాటు బీఆర్ ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తదితరులు అందెశ్రీ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ కవి అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన అందెశ్రీ మృతిపై స్పందించారు. అందెశ్రీ లేని లోటు తెలంగాణకు తీర్చలేనిది అని పేర్కొన్నారు.
……………………………………………………..
