
* కేసీఆర్ ఫ్యామిలీని..పార్టీని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోంది
* హరీష్ ట్రబుల్ షూటర్ కాదు..డబుల్ షూటర్
* విమానంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకున్నాడు
* ఆరడగుల బుల్లెట్ ఎక్కడ తగులుతుందో తెలియదు
* హరీష్ రావుపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన
కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
పార్టీ పతనం కావడానికి హరీష్ రావే ముఖ్య కారణం అన్నారు. ఈ రోజు నాకు పట్టిన గతే రేపు అన్న కేటీఆర్ కు పడుతుందని కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బీఆర్ ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి హరీష్ రావు,సంతోష్ రావులు ఒక్కటయ్యారని కవిత ఆరోపించారు.సీఎం రేవంత్, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్‌రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్రావే.’ అంటూ కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద సంపాందించిన అవినీతి సొమ్ముతలో 28 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో ఫండింగ్ ఇచ్చారని కవిత అన్నారు. బీఆర్ ఎస్ లో ఉంటూనే తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా.. ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. దుబ్బాకలో పార్టీ ఓడిపోవడానికి హరీష్ రావు తెర వెనుక రాజకీయం చేశారని కవిత అన్నారు. పైకి పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తి లాగా కన్పిస్తూ పార్టీకి గోతులు తీసే రకం అని కవిత అన్నారు.
హరీష్ రావు, సంతోష్ రావుల ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా,,?
బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష్ రావుల ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా
అంటూ కవిత ప్రశ్నింంచారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇద్దరు నేతల లెక్కలేనన్ని ఆస్తులను కూడబెట్టారని కవిత ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడితే కేసీఆర్ బదనాం అవుతున్నారని కవిత అన్నారు. పార్టీనుంచి విజయశాంతి, మైనంపల్లి, ఈటల పోవడానికి కారణం హరీష్ రావే అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలుపునకు హరీష్ కృషి చేశారని కవిత అన్నారు.
………………………………………………..