
* ఢిల్లీ వేదికగా మోదీ పై ఫైర్
* బీజేపీకి కులపిచ్చి పట్టుకుంది : కొండా సురేఖ
ఆకేరున్యూస్,డెస్క్: మంత్రి కొండా సురేఖ తన స్టైల్లో బీజేపీ పై విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేస్తున్న ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సారి ఆమె ప్రధాని మోదీనే టార్గెట్ చేశారు. బీజేపీ నేతలకు కులపిచ్చి పట్టుకుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది వితంతు మహిళ కావడంతో పార్టమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఆమెను పిలువలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రామమందిం ప్రారంభోత్సవంలో ముర్ము దళిత మహిళ కాబట్టి ఆమెను ఆహ్వానించలేదని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. బీజేపీ పెద్దలకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయిందని కొండా సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గత పది పదకొండేళ్లుగా దేశంలో కుల ఆధారంగా మత ఆధారంగా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తూ మనుషుల మధ్యవైశమ్యాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని కొండా సురేఖ నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ పరివారం అంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు ఢిల్లీ వేదికగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుందని భావిస్తున్నారు.
……………………………………….