* పోలీసులకు చిక్కిన 16మంది మావోలు
* పట్టుబడ్డ వారిలో అగ్రనేత బడే చొక్కా రావు అలియాస్ దామోదర్
ఆకేరున్యూస్ డెస్క్ : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతిచెందగా.. భారీ సంఖ్యలో మావోలు లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా మావోయిస్టు కీలక నేత పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత చొక్కరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ)లో 16 మంది మావోయిస్టులు పోలీసులకు చిక్కినట్టు సమాచారం. అలాగే వారిలో మావో అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన మావోయిస్టులు పెద్ద దోబలోని ఓ పూరిగుడిసెలో మావోయిస్టుల నివాసమెండగా.. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన మావోయిస్టులు చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వారీగా గుర్తించారు. అరెస్ట్ అయిన మావోయిస్టుల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. మావోయిస్టులు పట్టుబడటంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………………..
