* ముగ్గురు మావోయిస్టుల హతం
ఆకేరున్యూస్ డెస్క్: ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం, మారిమల్ల అడవుల్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోని మావోయిస్టులను భద్రతా దళాలు చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. భద్రతా దళాలు సంఘటనా స్థలంనుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా అదే ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా.. మావోయిస్టుల మృతిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
