
* ఏప్రిల్‌లో థాయిలాండ్, శ్రీలంక షెడ్యూల్
ఆకేరున్యూస్, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేనెల ఏప్రిల్‌లో విదేశీ పర్యటనకు థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 3-4 తేదీల్లో థారులాండ్ ఆతిధ్యం ఇస్తున్న ఆరవ బిఐఎంఎస్‌టిఇసి (శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగడానికి బ్యాంకాక్‌లో పర్యటించనున్నట్లు- భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడిరచింది. అనంతరం మోడీ ఏప్రిల్ 4-6 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకతో మోడీ చర్చలు జరపున్నట్లు- భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు- విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఏప్రిల్ 3 – 4 తేదీల్లో ప్రధాని థాయ్‌లాండ్‌లో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్తో భేటీ కానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్‌లో జరగనున్న ’బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’కూటమి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టు-బడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత థాయ్‌లాండ్ పర్యటనను ముగించుకొని ప్రధాని ఏప్రిల్ 4న శ్రీలంక వెళతారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే గతేడాది భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. మోదీ తన పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై చర్చించనున్నారు.
…………………………