* నలుగురు మావోయిస్టుల మృతి
* మృతుల సంఖ్య పెరిగే చాన్స్
* కొనసాగుతున్న కూంబింగ్
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణ సరిహద్దు చత్తీస్గఢ్ బీజాపూర్ ప్రాంతంలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన బీకర ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాల కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం వెస్ట్ బస్తర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ అంటి-నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. బైరామ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేస్కుతుల్ అటవీ ప్రాంతంలో ఉదయం 10 గంటల సమయంలో మొదలైన కాల్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు దొరికాయి. ఒక మావోయిస్టు గాయపడి పట్టుబడ్డాడు. మృతదేహాలు పాటు ఆయుధాలు, విస్ఫోటక పదార్థాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
