
* విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మృతి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : రామాంతాపూర్ లో కృష్ణాష్టమి వేడుకల్లో రథం లాగుతుండగా విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు వ్యక్తులు మృతి చెంది ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. పాత బస్తీలో బండ్లగూడ లో వినాయకుని విగ్రహం తీసుకెళ్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………..